ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగ గ్రంధం ఉండాలి 

నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలో ప్రజాస్వామ్య పరి రక్షణ ఐక్య వేదిక నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యములో  ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి తో భారత రాజ్యాంగ పీఠిక  బ్యానర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి 1949 నవంబర్ 26 వ తేదీన అమలైందని,ప్రతి సంవత్సరం నవంబర్ 26 న రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం గా జరుపుకుంటామని, రాజ్యాంగానికి ఆత్మ వంటిది రాజ్యాంగ పీఠిక అని,రాజ్యాంగం యొక్క మొత్తం సారాంశం ఈ పీఠికలో చెప్పబడినదని, ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్య పరి రక్షణ ఐక్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షులు ఆకుమల రహీమ్ మాట్లాడుతూ  భారత రాజ్యాంగం ప్రతి ఇంటిలో ఉండాలని, భారతీయుల ఆధునిక ధర్మ శాస్త్రం భారత రాజ్యాంగం గ్రంధం అని తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా రాజ్యాంగం ఆధారంగానే పరిపాలన సాగిస్తున్నాయని,


అందువలననే  ప్రజాస్వామ్య పరి రక్షణ ఐక్య వేదిక భారత రాజ్యాంగం పైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని,రాజ్యాంగ పీఠిక బ్యానర్ ను నంద్యాల లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల వద్ద  అంటించడం జరుగుతుందని తెలిపారు.నవంబర్ 26 వ తేదీ ప్రతి పాఠశాలలో మరియు కళాశాలలో రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవంజరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆకుమల రహీమ్, జిల్లా కోశాధికారి సత్యనారాయణ గుప్తా,మండల అధ్యక్షులు ఉమా మహేష్, మండల ప్రధాన కార్యదర్శి శివ నారాయణ,పట్టణ కోశాధికారి సయ్యద్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: