మృతుడు జిలాన్ భాష కుటుంబానికి  ఆర్థిక సహాయం అందజేసిన,,,

మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని స్థానిక నందికొట్కూరు పట్టణంలో 25 వ వార్డుకు చెందిన జిలాన్ భాషా రాత్రి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలియజేశారు. విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ, 8వ వార్డ్ ఇంచార్జి శాలి భాష లు మృతుడు జిలాన్ బాష కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, మనో ధైర్యంతో ఉండాలని, జిలాన్ భాష కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం(రబ్బాని గ్రూప్స్) తరుపున మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని మృతి చెందిన  జిలాన్ భాషా కుటుంబానికి 5,000/- రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో అబ్బాస్,రియాజ్, చాంద్ బాషా,ఇమ్రాన్, వైస్సార్సీపీ సోషల్ మీడియా కో-కన్వీనర్ పసుల శ్రీనివాసులు నాయుడు, మోహన్ తదిరులు పాల్గొన్నారు.


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: