ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలి

పార్టీ నేతలకు , కస్టర్లకు, యూనిట్ ఇన్చార్జిలకు దిశా నిర్దేశం చేసిన.. టిడిపి నాయకులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి ప్రజలకు మరింత చేరువకావాలని పార్టీ నేతలకు , కస్టర్లకు, యూనిట్ ఇన్చార్జిలకు టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. నంద్యాల స్థానిక పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు "ఇందెం - ఖర్మ" మన రాష్ట్రానికి అనే కార్యక్రమం లో భాగంగా స్థానిక నంద్యాల పట్టణం లో ఆర్కే కన్వెన్షన్ హాల్లో నంద్యాల పార్లమెంట్  తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జి ల ట్రైనింగ్ కార్యక్రమం లో పాల్గొన్న టిడిపి నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి  గౌరు వెంకట రెడ్డి, పాణ్యo మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "బాదుడే - బాదుడు" కార్యక్రమంతో ప్రజలకు చేరువయ్యమని, ప్రజలకు మరింత చేరువేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుల పని చేసి ప్రజలకు మరింత చేరువవ్వ లని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి, ఎమ్మెల్సి  ఎన్ఎండీ. ఫరూక్, బనగానపల్లే మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి మన్నే సుబ్బా రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, ఎన్ఎండీ ఫిరోజ్, టీడీపీ క్లస్టర్ ఇంచార్జి ల ట్రైనర్లు విశ్వనాథ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గల క్లస్టర్ ఇంచార్జి లు, యూనిట్ ఇంచార్జి లు, తెలుగుదేశం పార్టీ మండలాల నాయకులు, ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫరూక్ బాషా, కార్యకర్తలు టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: