చిరు వ్యాపారస్తులకు ఆటంకం కలగకుండా చూడాలని
నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ కు వినతి పత్రం అందజేత
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మహాబున్నిసా గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టకుండా వారి వ్యాపారాలు వారు చేసుకొనే విధముగా సహకరించాలని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మహాబున్నిసా సానుకూలంగా స్పందించి చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా చూస్తానని ,అదే విధంగా ప్రజలకు చిరు వ్యాపారులు కూడా ఆటంకం కలగకుండా వ్యాపార లావాదేవీలు జరుపుకునేలా సహకరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గుప్తా ,గౌరవ అధ్యక్షులు అకుమల్లా రహీమ్ ,ఉపాధ్యక్షులు సంజీవ రాజు , చంద్రాపాల్, కోషాది కారి నారాయణ సభ్యులు మన్సూర్,కలాం, సిద్దయ్య ,సయ్యద్ మౌలాలి,ననిరసూల్ ,అన్వర్, పాల్గొన్నారు.
Home
Unlabelled
చిరు వ్యాపారస్తులకు ఆటంకం కలగకుండా చూడాలని,,,, నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ కు వినతి పత్రం అందజేత
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: