ఇథనాల్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న సీఎం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇథనాల్ పరిశ్రమ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గోపవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న ఇథనాల్ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సమీపంలోని హెలిప్యాడ్ చేరనున్న జగన్... హెలికాప్టర్ ద్వారా గోపవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుమ్మళ్లదొడ్డి గ్రామంకు వెళతారు. గ్రామంలో ఇథనాల్ పరిశ్రమకు శంకుస్థాపన చేసి తిరిగి అదే హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1.10 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం చేరుకుంటారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: