"తోటబడి--పొలంబడి"పై..... అవగాహన కల్పించిన...
గడివేముల మండల వ్యవసాయ అధికారి హేమసుందర్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని పెసర వాయి గ్రామంలో "తోట బడి"-- "పొలంబడి" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గడివేముల మండల వ్యవసాధికారి హేమసుందర్ రెడ్డి మాట్లాడుతూ 14 వారాలపాటు 30 మంది రైతులతో పొలంలోని విత్తనం నాటిన మొదల నుండి రైతుకు పంట చేతికి అందే వరకు చేసే కార్యక్రమాన్ని "పొలంబడి" అంటామని తెలిపారు. "తోట బడి" ముఖ్య ఉద్దేశం తక్కువ పెట్టుబడి తో నాణ్యమైన,ఆరోగ్యకరమైన పంటను పండించడమని,"తోట బడి"లో రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన నాలుగు ప్రధాన అంశాలను గుర్తు పెట్టుకోవాలని, ఆరోగ్యకరమైన పంటను పండించడం, రైతుల మిత్ర పురుగులను సంరక్షించుకోవడం, తప్పనిసరిగా ప్రతిరోజు రైతులు పంట పొలాలను చూసుకోవాలని, రైతుకు పంటపై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కల్పించడమని, పంటలపై సమగ్ర సస్యరక్షణలో భాగంగా తెల్ల దోమ మరియు తామర పురుగుల నివారణకై పసుపు,
నీలిరంగు మరియు తెలుపు జిగురు అట్టలను పొలంలో ఒక ఎకరానికి 20 నుంచి 30 అట్టలు పంట కంటే ఒక అడుగు ఎత్తున అమర్చుకోవాలని,ఎర్ర పంటగా బంతిపూలు, కంచ పంట గా జొన్న పంటను మరియు మొక్కజొన్న పంటను వేసుకోవాలని, మొవ్వ కుళ్ళు తెగులు మరియు బొబ్బర తెగులు కు కారకాలైనటువంటి తామర పురుగులు మరియు తెల్ల దోమలను సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో జిగురు అట్టలతో నివారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండల వ్యవసాయ శాఖ సిబ్బంది, పెసర వాయి గ్రామ రైతులు పాల్గొన్నారు.
Home
Unlabelled
"తోటబడి--పొలంబడి"పై..... అవగాహన కల్పించిన... గడివేముల మండల వ్యవసాయ అధికారి హేమసుందర్ రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: