“అయ్యప్ప స్వామి మహా పడిపూజ” కార్యక్రమంలో పాల్గొన్న

బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్- రాజేంద్రనగర్ ప్రతినిధి)

“అయ్యప్ప స్వామి మహా పడిపూజ” కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మండలంలో జరిగిన ఈ “అయ్యప్ప స్వామి మహా పడిపూజ” కార్యక్రమానికి రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి నాయకులతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదాన్ని బుక్క వేణుగోపాల్ స్వీకరించారు.


అనంతరం పూజా కార్యక్రమానికి హాజరైన ప్రముఖులను నియోజకవర్గ ప్రజలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి శ్రీధర్, జిల్లా కార్యదర్శి కొమ్మరయ్య, ఓబిసి రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు బుక్క క్రిష్ణ, శంషాబాద్ పట్టన ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.








Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: