భూ కబ్జాదారులు స్మశాన స్థలాలను కూడా వదలడం లేదు

సిపిఎం(మార్కిస్ట్) కార్యదర్శి పుల్లా నరసింహులు

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలోని పొగాకు కంపెనీ బైపాస్ రోడ్డు నందు బర్రెల గ్రౌండ్ ఉంది, ఆ  స్థలాన్ని క్రిస్టియన్ సోదరులకు ప్రస్తుత అధికార పార్టీ నాయకులు,  అధికారులు స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించారు ,ఆ స్థలాన్ని కూడా కబ్జా చేసి అమ్ముకోవాలని చూస్తున్నారని, భూ కబ్జాదారుల ఆటలు సాగవు అని భారత కమ్యూనిస్టు పార్టీ( మార్క్సిస్టు) సి.పి.ఎం పార్టీ పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు తెలియజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరులకు స్మశానస్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని అలాంటి తరుణంలో క్రిస్టియన్స్ జే.ఏ.సీ సోదరులు పోరాట ఫలితంగా ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకులు కుందునది వెంట అసైన్మెంట్ ల్యాండ్ ఉంది ఆ స్థలంలో దళితుల స్మశాన వాటికను ఏర్పాటు చేసుకుని ఉపయోగించుకోవాలని సూచించారు, ఇప్పుడు నంద్యాల జిల్లా కావడంతో స్థలాలకు మంచి విలువలు వచ్చాయి అందుకే అక్కడ కొందరు రాజకీయ నాయకుల అండదండలతో స్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేయడానికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, నంద్యాల కుందు వెంట పోరంబోకు ల్యాండ్ సుమారు వంద ఎకరాలు ఉంటుందని ఈ  స్థలం పై భూ కబ్జాదారులు కన్నేసి వందల కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారనీ,


స్మశానాలను కూడా వదలకుండా ఖాళీ చేయించాలని చూస్తున్నారని ,ఈ ప్రాంతంలో క్రిస్టియన్ దళితులకు స్మశానాలు లేవు. బొమ్మల సత్రం, ఎమ్మెస్ నగర్, మిషన్ కాంపౌండ్, జ్ఞానాపురం, దేవ నగర్ ,రాయల్ కాంపౌండ్, బొగ్గుల లైన్, ఈ ఏరియాలలో క్రిస్టియన్స్ దళితులు ఎక్కువగా ఉన్నారు, కాబట్టి వీరికి కచ్చితంగా స్మశాన వాటిక అవసరమని, క్రిస్టియన్ సోదరులకు ఇప్పుడు  బర్రెల గ్రౌండ్ స్మశానంగా వాడుకుంటున్నారని, క్రిస్టియన్ దళితులకు స్మశాన వాటికకు కేటాయించకుండా కబ్జా చేయాలని చూస్తే సహించేది లేదని, స్మశాన వాటికకు స్థలం కేటాయించకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు, అదేవిధంగా నంద్యాల పట్టణంలో ఏదేచ్ఛగా ప్రభుత్వ స్థలాలు కబ్జా గురవుతున్నాయని, వాటిని ప్రభుత్వం కాపాడాలని వారు సూచించారు, కుందు నదీ పరిసర ప్రాంతాలలో సుమారు 100 ఎకరాలకు పైగా పోరంబోకు ల్యాండ్ ఉందని, వాటిని కాపాడి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ,ఈ కార్యక్రమంలో సిపిఐ (మార్క్ స్ట్) నాయకులు రాజు ,కిరణ్, దేవేంద్ర, మోహన్ బాబు ,ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: