పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి,,,

వంకిరి. రామచంద్రుడుని గెలిపించండి

బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, విద్యార్థి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలుట్ల రమణ

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ వంకిరి. రామచంద్రుడు గారిని గెలిపించాలని బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, విద్యార్థి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాలుట్ల రమణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణంలో ఉన్న బసిరెడ్డి డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ రమేష్ రెడ్డి, విజయవాణి స్కూల్ కరస్పాండెంట్ సుబ్బారెడ్డి మరియు శేఖర్, వైష్ణవి కాలేజ్ కరెస్పాండెంట్ రవీంద్ర బాబు,విజ్ఞాన్ కాలేజ్ ప్రిన్సిపల్, విద్యార్థి సంఘ నాయకులు శేఖర్ నాయక్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు అల్లప్ప మరియు నిరుద్యోగులను కలిసి


ప్రచారం నిర్వహించి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వంకిరి. రామచంద్రుడు కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని,నిరంతరం విద్యార్థి, యువజన ప్రజా సమస్యలపై గత 15 సంవత్సరల నుంచి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న వంకిరి. రామచంద్రుడు గారి కి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి,వేయించి  ప్రశ్నించే నాయకుడిని మండలికి పంపాలని, పట్టభద్రుల ఓటర్లను అభ్యర్థించారు. 
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు విష్ణు, ప్రవీణ్,  మోహన్,తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: