తెలుగుదేశం పార్టీ మండల కమిటీ నాయకులకు, కార్యకర్తలకు

దిశా నిర్దేశం చేసిన నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం నియోజకవర్గ ఇంచార్జ్ గౌరు చరిత రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కర్నూలు పట్టణం దేవి ఫంక్షన్ హాల్ నందు స్వర్గీయ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఆర్టీఎస్ (రియల్ టైమ్ స్ట్రాటాలజీ) ట్రైనింగ్ ప్రోగ్రాంలో ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం టీడీపీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు,నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి,  పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టిఎస్ ట్రైనింగ్  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంటు టిడిపి అధ్యక్షులు, నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గౌరు వెంకట రెడ్డి   మాట్లాడుతూ నియోజకవర్గాలలో, మండలాలలో, గ్రామాలలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి కొరకు కన్వీనర్లు, కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. పాణ్యం మాజీ శాసనసభ్యురాలు గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు చాలా ముఖ్యమైనవి అని, ఎన్నికలలో టిడిపి గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ సైనికుడిలాపని చేయాలని, ముఖ్యంగా ఓటర్ లిస్టులను పరిశీలించాలని, మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తల అందరి సమన్వయంతో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని,


వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఇబ్బందులకు గురి  చేస్తున్న వారిని ఇది తప్పు అని ప్రశ్నించిన వారిపైనే అక్రమ కేసులు పెడుతున్నారని, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశం అని తెలిపారు. నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే సోషల్ మీడియా తరఫున ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి తీసుకుని వెళ్లాలని తెలిపారు.

ఈ సమావేశం లో రాష్ట గొర్రెల పెంపకం చైర్మన్ నాగేశ్వర రావు యాదవ్, నంద్యాల పార్లమెంట్ మహిళ టిడిపి అధ్యక్షురాలు పార్వతమ్మ,జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లు, మార్కెట్ యార్డ్ మాజీచైర్మన్ లు,మాజీ ఎంపీపీలు తెలుగు యువత అధ్యక్షుడు ప్రభాకర్ యాదవ్,నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు గంగదర్ గౌడ్, జిల్లా కార్యదర్శి కేతురూ మదు, ఆర్టీఎస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ట్రైనర్ ముస్తక్, అబ్జర్వర్ దేవల్ల మురళి, మైనారిటీ నాయకులు  ఫిరోజ్, షకీల్ అహ్మద్, జాకీర్, ఇలియాజ్, పాణ్యం మరియు నందికొట్కూరు నియోజకవర్గాల మండలాల అధ్యక్షుల్లు,రామాంజనేయులు, దేశం సత్యనారాయణ రెడ్డి, కాత రమేష్ రెడ్డి, పలుచాని మహేష్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, వెంకట రెడ్డి, వేంకటేశ్వర్లు యాదవ్, నియోజకవర్గాలలోని అన్ని గ్రామాల టిడిపి నాయకులు,కార్యకర్తలు, క్లస్టర్ ఇంచార్జి లు, యూనిట్ ఇంచార్జి లు, బూత్ కన్వీనర్లు, కల్లూరు అర్బన్ వార్డ్ ఇంచార్జీ లు నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: