ఘనంగా బాలల దినోత్సవం

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాగడివేముల మండలం లోని స్థానిక ఎంఈఓ కార్యాలయంలో, గడివేముల, గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 133 వ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.బాలల దినోత్సవ సందర్భంగా పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు,ఆటల పోటీలు, మరియు పాటల పోటీలు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి బహుమతులను అంద చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ గారు నవంబర్ 14-1889 వ తేదీన మోతిలాల్ నెహ్రూ స్వరూప రాణి తుస్సు దంపతులకు అలహాబాద్ పట్టణంలో జన్మించారని స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 సంవత్సరం నుండి 1964 వ సంవత్సరం వరకు భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నారని, బాలలు విద్యారంగంలో విద్యను అభ్యసించడానికి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడని అందుకే జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు ను బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నామని, పిల్లల మనసును గెలుచుకున్నందుకే "చాచా నెహ్రూ" అని పిలుస్తున్నామని తెలిపారు.గడివేముల ఎంఈఓ రామకృష్ణుడు మాట్లాడుతూ,

గడిగ రేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 


నెహ్రూ జయంతిని అన్ని పాఠశాలల్లో బాలల దినోత్సవం గా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరంనెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు,బాలల దినోత్సవం సందర్భంగా, అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ రకాలైన పోటీలు నిర్వహించి, బహుమతుల ప్రధానం చేసినట్లు తెలిపారు. లైబ్రరీ వీక్ లో భాగంగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ను అన్ని పాఠశాలల్లో నిర్వహించడంతో, పిల్లలు వారికి నచ్చిన కార్టూన్ పాత్రలు, పుస్తకంలోని వ్యక్తులు,కవులు, రచయితలు, ప్రముఖల వేషధారణలో అలరించారని తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: