ప్రగతిశీల విప్లవ విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం

పి.డి.ఎస్.యు. నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్.ఎం.డీ రఫీ


(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని స్థానిక బనగానపల్లెలో ప్రగతిశీల విప్లవ విద్యార్థి ఉద్యమంలో విద్యా వ్యతిరేక విధానాలపై పోరు సాగిస్తూ ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల సంస్మరణ సభలను  పి.డి.ఎస్. యు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పి.డి.ఎస్. యు. నంద్యాల పట్టణ  కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ జూనియర్ కళాశాల నందు   పి.డి.ఎస్. యు. నంద్యాల పట్టణ కార్యదర్శి నవీన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి  ముఖ్య అతిథిగా  పి.డి.ఎస్.యు. జిల్లా అధ్యక్షులు ఎస్.ఎం.డీ రఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల హక్కుల కోసం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం గత 50 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నదని, పి.డి.ఎస్.యు. వ్యవస్థాపకులు ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార, న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ కామ్రేడ్ జార్జి రెడ్డి గారి వారసత్వాన్ని అందుకొని యావత్తు రాష్ట్రవ్యాప్తంగా ప్రగతిశీల ఉద్యమ కెరటాలని నిలిపిన, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థి కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్, ప్రసాద్, శ్రీహరి, రంగవల్లి, కోలా శంకర్ ,స్నేహలత  లాంటి అనేకమంది విప్లవ విద్యార్థిని,విద్యార్థులు తమ  ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాలు వెలకట్టలేనివని తెలిపారు. నేడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానం సంస్కరణలు అవలంబిస్తూ బడుగు, బలహీన, మధ్యతరగతి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని,



కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను, యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో  ప్రైవేటు కార్పొరేట్ విధానాలకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చెందకుండా, ఫండ్స్ రిలీజ్ చేయకుండా విద్యార్థులను, ప్రభుత్వ సంస్థలను అగమ్య గోచరంలోకి నెట్టివేసే విధంగా ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  కుల, మత ఉన్మాద సుడిగుండంలో విద్యార్థులు, యువతీ యువకులు పడవద్దని,సమ సమాజ స్థాపనకై, కుల,మత, లింగ వర్గ బేధాలు లేనటువంటి సమాజం కోసం, శాస్త్రీయ విద్య సాధనకై పాటుపడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తూ వారి ఆశయాల సాధనకై ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నంద్యాల పట్టణ అధ్యక్షులు షేక్.మహమ్మద్ , పి.డి.ఎస్.యు నంద్యాల పట్టణ అధ్యక్షులు దస్తగిరి కార్యదర్శి నవీన్ నాయకులు నాని,శంకర్,జఫ్ఫార్, రవి, రసూల్ , ఇనాయత్, ప్రకాష్, విష్ణు. విద్యార్థులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: