జల్పల్లి లో మునుగోడు ఉప ఎన్నికల గెలుపు సంబరాలు

పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న టిఆర్ఎస్ నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

 మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్పల్లి పురపాలక సంఘం లో, టిఆర్ఎస్ పార్టీ జల్పల్లి పురపాలక  సంఘము  అధ్యక్షులు ఇక్బాల్ బిన్ ఖలీఫా ఆధ్వర్యంలో మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు అంబురాన్ని అంటి నాయి ఈ యొక్క సంబరాలు షాహిన్ నగర్,, శ్రీరామ కాలనీ అన్ని ప్రాంతాల్లో ఘనంగా బాణసంచా కాల్చి జరుపుకున్నారు.


నాయకులు కార్యకర్తలు అందరూ జై తెలంగాణ, జై బిఆర్ఎస్ , జై కేసీఆర్, జై సబితమ్మ నినాదాలతో పురపాలక సంఘం మొత్తం మారు మోగిపోయింది.


ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ ఉపాధ్యక్షులు నాజర్ వల్గి, మున్సిపల్ వైస్ చైర్మన్ యూసఫ్ పటేల్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ జహంగీర్, గౌరవ కౌన్సిలర్స్ శంసుద్దీన్, లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, సౌద్ అవల్గి ,జల్ పల్లి  పురపాలక సంఘం జనరల్ సెక్రటరీ మెహబూబ్ హసన్ బాబా , యువ నాయకులు యంజాల అర్జున్, బీసీ సెల్ అధ్యక్షులు ఉష్కమూరి నిరంజన్ నేత ,మహిళా ఉపాధ్యక్షురాలు కర్నాటి పద్మ , ఎస్సీ సెల్ అధ్యక్షులు చెన్నం రాజేష్ , సీనియర్ నాయకులు నవ పేట ఆంజనేయులు, బర్కత్ అలీ , ,నియాజ్ భాయ్, మారుతి, నర్సింగ్ అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: