ఖరీఫ్ సీజన్ పంటలను నమోదు చేసిన...
గడివేముల వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గడివేముల మండల వ్యవసాయ శాఖ అధికారి హేమసుందర్ రెడ్డి మండలంలోని 5,809 మంది రైతులకు 19,790 ఎకరాలలో ఖరీఫ్ 2022 లో సాగు చేసినటువంటి వివిధ పంటల పైన పంట నమోదు కార్యక్రమము , క్షేత్రస్థాయి పరిశీలన చేసి రైతుల వేలిముద్రలు తీసుకొని సామాజిక తనికి కొరకు సంబంధిత ఆర్బికేలలో ప్రచురించారు,
నవంబర్ 2 ,3,4 వ తేదీలలో ప్రతి ఒక్క ఆర్ బి కే ల నందు గ్రామసభలు ఏర్పరిచి ఆ ఆర్ బి కే నందు నమోదైన పంట మరియు విస్తీర్ణం వివరములను చదువుతూ రైతులకు అందరికీ తెలియజేయడం జరుగుతుందని, ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్టయితే రైతు సోదరులు సంబంధిత ఆర్బికే సిబ్బందికి ఫిర్యాదు పత్రంలో తెలియ చేయవలసిందిగా గడివేముల మండలం వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి తెలిపారు.
Post A Comment:
0 comments: