గిరిజన గురుకుల పాఠశాల హాస్టల్లో
విద్యార్ధులే వంట మనుషులు
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (ఏపీటీడబ్ల్యూఆర్) హాస్టల్లో విద్యార్థులే వంట మనుషులుగా మారి వంటలు వండుకోవడం, శుభ్రం చేయడం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజుల నుండి హాస్టల్ ను శుభ్రం చేసుకోవడం , వంట వండుకొని తినడం విద్యార్థులకు "దినచర్య" గా మారిందని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బత్తిని ప్రతాప్, పాణ్యం మండల కార్యదర్శి బాలకృష్ణ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఎవ్వరూ చూడరు, ఎవ్వరూ అడగరు అనే ధైర్యం తో ఉన్న గురుకుల పాఠశాల హాస్టల్ సిబ్బంది ఉన్నారని,
ఎవరైనా ప్రజా సంఘాలు, పాత్రికేయులు అడిగితే రోజు కూలీ పనిమనుషులు రాలేదని,ఇద్దరు సెలవు పెట్టారనీ, గురుకుల పాఠశాల హాస్టల్ సిబ్బందీ 275 మంది విద్యార్ధులు చదువుకోవాలా... లేక అర్ధాకలితో వారి వంట వారే వండుకోవాలా... అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల హాస్టల్ ల ను నంద్యాల జిల్లా గిరిజన సంక్షేమ అధికారి తనిఖీలు నిర్వహించి అధికారులపై, హాస్టల్ సిబ్బందిపై, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల సంక్షేమం కోసం విద్యార్థి సంఘాలు ఆర్వీఎఫ్-ఏఐఎస్బీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
Home
Unlabelled
గిరిజన గురుకుల పాఠశాల హాస్టల్లో,,, విద్యార్ధులే వంట మనుషులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: