గ్రామ పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది,,,

నిర్లక్ష్యం వహిస్తే,,,కఠిన చర్యలు తప్పవు

నంద్యాల డివిజన్ పరిధి పంచాయతీ అధికారి రాంబాబు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గడివేముల, చిందుకూరు,  కొరటమద్ది, మరియు దుర్వేశి ల గ్రామపంచాయతీ కార్యాలయాలను, తడి, పొడి చెత్త కేంద్రాలను సందర్శించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామంలో తడి మరియు పొడి చెత్త లను వేరువేరుగా సేకరించాలని, గ్రామంలో కాలుష్య నివారణకు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ తప్పని సరిగా విధులు నిర్వహించి, కాలుష్య నివారణను అరికట్టాలని తెలిపారు. అనంతరం గ్రామ సచివాలయను  సందర్శించి గ్రామ సచివాలయం సిబ్బంది పని తీరును పరిశీలించిన అనంతరం సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ


గ్రామంలోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందరికీ తెలియజేయాలని, సచివాలయం
కు వచ్చే ప్రజల పట్ల సఖ్యత కలిగి ఉండాలని, సచివాలయ సిబ్బంది అందరూ తప్పక  సమయపాలన పాటించాలని, సమయపాలన పాటించని సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్డి ఖాలిక్ భాషా, మరియు గ్రామపంచాయతీల కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: