"నాడు-నేడు"పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
గడివేముల ఎంఈఓ రామకృష్ణుడు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల పరిధిలోని స్థానిక ఎం.ఈ.ఓ రామకృష్ణుడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు, పనులు వేగవంతం చేయాలని స్పెషల్ ఆఫీసర్ రూబీన గారికి సూచించారు. అనంతరం మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన మెనూను ఆవిష్కరించిందని, నూతన మెనూ ప్రకారమ, నాణ్యమైన మరియు రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు సూచించారు.
అనంతరం ఎంఈఓ కార్యాలయంలో జరిగిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ"నాడు-నేడు" పనులలో పురోగతి ఉండాలని అలాగే విద్యార్థులకు అందించిన జగనన్న విద్యా కానుక కిట్ల యొక్క బయోమెట్రిక్ ఐడెంటికేషను రేపు సాయంత్రం లోగా పూర్తి చేయాలని,ఈరోజు అందిస్తున్న టిఎఆర్ఎల్ మెటీరియల్ ను ఉపయోగించి విద్యార్థులకు సరళమైన పద్ధతుల్లో విద్యను బోధించాలని, సంబంధిత మార్కులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Home
Unlabelled
"నాడు-నేడు"పనులు త్వరితగతిన పూర్తి చేయాలి,,,, గడివేముల ఎంఈఓ రామకృష్ణుడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: