జరిమానాలు విధించడమే కాదు...
వాహనదారులకు పార్కింగ్ సదుపాయం కల్పించాలి
జానో జాగో...కాంగ్రెస్ సేవాదళ్ డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
జరిమానాలు విధించే ముందు నంద్యాల పట్టణ వాహనదారులకు ముందుగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని జానో జాగో...కాంగ్రెస్ సేవాదళ్ డిమాండ్ చేశాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక ) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్ మాట్లాడారు. నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలో వాహనదారులకు అధిక మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారని పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
నంద్యాల పట్టణంలో గత కొన్ని రోజులుగా పట్నంలోని అన్ని సెంటర్లలో ఉన్న వ్యాపార సముదాయాలు దగ్గర, శ్రీనివాస సెంటర్ లో షాపుల ముందర బండలు మరియు సిమెంటు దిన్నేలు తీసివేసి వేశారని, షాపుల్లో నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చే ప్రజలకు వాహనాలు పార్కింగ్ చేయడానికి సదుపాయం లేదని,, కొన్ని చోట్ల గుంతలు తీసి వాటికి మరమ్మతులు చేయకుండా వదిలేసారని, అనునిత్యం వేలాదిమంది నంద్యాలకు ప్రజలు సరుకులు కొనుగోలు చేయడానికి వస్తుంటారని, ప్రజలకు పార్కింగ్ సదుపాయం లేక రహదారుల పక్కన వాహనాలు పార్కింగ్ చేస్తే నంద్యాల ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఫోటోలు తీసి జరిమానాలు విధిస్తున్నారని, పేద మధ్యతరగతి ప్రజలు జరిమానాలు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,
నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి, మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్పందించి నంద్యాల ప్రజల కు జరిమానాలు విధించడమే కాదు పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని వాహనదారులకు పార్కింగ్ సమస్యను తీర్చాలని వారు కోరారు.
Post A Comment:
0 comments: