సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలి

రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజక వర్గం, ఓర్వకల్లు మండల కేంద్రము లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల  పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి అని  రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్ర నాథ్, ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రమణ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ   ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని  ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పోరుబాట కార్యక్రమం సర్వే చేసేందుకు వెళ్ళినప్పుడు విద్యార్థులు వారి సమస్యలను కంటతడితో పంచుకున్నారని, సంక్షేమ వసతి గృహాల్లో కాస్మోటిక్స్. మెస్ చార్జీలు రాకపోవడంతో విద్యార్థులకు పౌష్టికాహారం సరిగా అందడం లేదని వార్డెన్లు నాసిరకం ఆహారంతోనె నేట్టుకొస్తున్నారని,


కాస్మోటిక్ ఛార్జీలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు అని, నంద్యాల జిల్లా లోని  హాస్టల్ లలో త్రాగునీటి సమస్య  మరుగు దొడ్లు సమస్య ప్రధాన సమస్యగా నెలపొందని, తాగు నీరు లేకపోవడం విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వర్షాలు వస్తే విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ నిద్ర లేకుండా గడుపుతున్నారని,ప్రతి నెల హెల్త్ చెక్ అప్ నిర్వహించడం లో వార్డెన్లు విఫలం అయ్యారని, సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యాన్ని సరఫరా చేయాలని, సమస్యలు పరిష్కారించాలని ఎమ్మార్వో  కార్యాలయాకి విద్యార్థులతో కలిసి సాముహిక ర్యాలీ గా వెళ్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పైన ఎమ్మార్వో  శివ ప్రసాద్ రెడ్డి గారికి వివరించి వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మార్వో శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయం  గురించి పై అధికారులకు తేలియజేసి తక్షణమే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాల క్రిష్ణ నాయక్. నరేష్‌ . సురేష్.రవితేజ.  రమేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: