భక్తీశ్రద్దలతో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం

ముఖ్య అతిధిగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్ర నగర్ ప్రతినిధి)

రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల అమ్మపల్లి అభయ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద కార్తీక మాస చివరి మంగళవారం రోజున అయ్యప్ప స్వామి పూజ మరియు మహా దీపారాధన నిర్వహించారు. రాష్ట్ర ఓబీసీ మోర్చ కార్యనిర్వాహక సభ్యులు బుక్క క్రిష్ణ స్వామి నిర్వహించిన ఈ అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ కుటుంభ సమేతంగా హాజరయ్యారు. అయప్ప స్వామి పూజలో పాల్గొన్న అయ్యప్ప స్వాములకు బుక్క వేణుగోపాల్ అల్పహార విందును ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబు గురుస్వామి, అమ్మపల్లి సన్నిధాన స్వాములు, శంషాబాద్ మండల ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.


  

 Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: