టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా.... ఎస్ ఏ ఫారుక్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యవర్గ సభ్యులకు మంగళగిరిలోని ప్రధాన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం జరిగింది. పాణ్యం నియోజకవర్గ నుంచి ఎస్.ఏ. ఫారుక్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా ప్రమాణం స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎస్.ఏ. ఫారుక్ మాట్లాడుతూ మైనార్టీ సోదరులందరికీ అందుబాటులో ఉండి కార్యకర్తలను, అభిమానులను అందరిని కలుపుకొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుని, గెలిపించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి పదవి లో నియమించిన నంద్యాల తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు  గౌరు వెంకట రెడ్డికి మరియు పాణ్యం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గౌరు చరితా రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: