హుస్సేనీ అలం పోలీస్ స్టేషన్ పరిధిలో..

గడువు ముగిసక అర్ధరాత్రి వ్యాపారాలు నిర్వహించిన వారిపై కేసు నమోదు

నిబంధనలకు వ్యతిరేకంగా వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు-సీఐ నరేష్


(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా, నిర్ణీత సమయం తరువాత హోటల్లలో వ్యాపార కలాపాలు నడుపుతున్న వారిపై హుసేనియాలం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కేసు నమోదు చేశారు. అనంతరం వారిని బుధవారం నాడు కోర్టు ముందు ప్రవేశ పెట్టగా మొదటి ప్రత్యేక మెట్రోపోలిటన్ న్యాయమూర్తి  విచారించి  1. మొహమ్మద్ జమీర్ ఖాన్, ఖాన్ దోష, కాసారట్ట 2. మొహమ్మద్ ఇబ్రహీం, ఆల్ లబ్బాయిక్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చార్మినార్ బస్టాండ్, జూనైద్ ఖాన్, రెడన్ హోటల్, ఖిలవత్ లకు ఒక్కొక్కరికి మూడు రోజుల జైలు శిక్షతోపాటు Rs 1050/ జరిమానా విధించినరు. ఈ సందర్భంగా హుసైన్యాలు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలోని వ్యాపార, హోటల్.. షాప్.. పాన్ డబ్బాలు తదితర సంస్థలు నిబంధన మేరకు నిర్ణీత సమయంలోపు తమ వ్యాపార లావాదేవీలు ముగించేయాలని సూచించారు.  గడువు దాటాక రాత్రి ఇలాంటి కార్య కలాపాలు కొనసాగిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: