మీరిద్దరూ పక్కకు తప్పుకోండి

ఆటలోనూ పరమత సహనం ప్రదర్శించిన కెప్టెన్ బట్లర్


టీ20 ఫైనల్ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విశ్వ విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టు అంబరాన్నంటే సంబరాలు చేసుకుంది. ఆటగాళ్లంతా ట్రీఫోతో కేరింతలు కొట్టారు. అంతా కలిసి వీడియోలకు ఫోజులిచ్చారు. ఆటగాళ్లంతో గ్రూపుగా ఒకచోట చేరి చాంపియన్స్ అన్న బోర్డు వేదికవద్ద గుమిగూడారు. ఆటగాళ్ల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ లోగా కెప్టెన్ బట్లర్ వాళ్లిద్దరి వంక గౌరవంగా చూస్తూ పక్కకు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు. వాళ్లకూ అర్థమైంది! మరో క్షణం ఆలోచించకుండా మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ పక్కకు తొలిగిపోయారు. ఇంకేముంది షాంపైన్ బాటిల్స్ తెరచుకున్నాయి.  బీరు బాటిళ్లలోని బీరును పొంగించారు. ఒకరిపై ఒకరు బీరును చిమ్ముతూ కేరింతలు కొట్టారు. మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ ఇస్లామ్ ధర్మాన్ని తూచ తప్పకుండా పాటించే ఆటగాళ్లని కెప్టెన్ కి బాగా తెలుసు. అందుకే కెప్టెన్ వారిద్దరినీ  గౌరవిస్తూ పక్కకు వెళ్లమన్నాడు. ఇదే పరమత సహనమంటే. మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ లు ఇస్లామ్ ప్రతిబింబాలుగా ప్రపంచానికి చాటిచెప్పారు.   

రచయిత 

- ముహమ్మద్ ముజాహిద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: