గిరిజన విద్యార్థులకు ఆటలు అవసరం లేదా
గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జవహర్ నాయక్
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం లోని బైర్లూటి గ్రామం లోని గిరిజన విద్యార్థులకు ఆటలు అవసరం లేదా..? గ్రామీణ క్రీడాకారులను పట్టించుకోరా..? అని గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జవహర్ నాయక్ అన్నారు. ఆత్మకూరు మండలంలోని బైర్లూటి చెంచుగూడెం లోని ప్రభుత్వ ప్రాథమిక,ఉన్నత పాఠశాలల ఆట ప్రదేశాలను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆటలు ఆడే ప్రాంతంలో పిచ్చి మొక్కలు పెరిగి,విద్యార్థులు ఆటలు ఆడుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని,పాఠశాలల ప్రధానోపాధ్యయులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.
విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా చాలా అవసరం. ఆటలకు సమయం ఇవ్వలేని వారు భవిష్యత్తులో రోగాలకు సమయం ఇవ్వవలసి వస్తుంది.ఒకవైపు ప్రభుత్వము క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే మరొకవైపు ప్రధానోపాధ్యాయిని నిర్లక్ష్యము అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల బైర్లుటీ పాఠశాల గిరిజన విద్యార్థులు ఆటలకు దూరం కావలసి వస్తుందని, ఇప్పటికైనా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పర్యవేక్షణ అధికారులు స్పందించి ఆ పాఠశాల గ్రౌండ్ లోని పిచ్చి మొక్కలను తొలగించి గిరిజన విద్యార్థులు ఆటలు ఆడుకునేటట్లు చూడాలని,గ్రామీణ గిరిజన క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆయన అన్నారు.
Home
Unlabelled
గిరిజన విద్యార్థులకు ఆటలు అవసరం లేదా,,, గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జవహర్ నాయక్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: