నిర్ణీత సమయంలోపు వ్యాపారకలాపాలు నిర్వహించాలి

సమయం దాటి నిర్వహిస్తే కేసులు బుక్ చేస్తాం

హోటల్స్..బేకారీస్..వ్యాపార సంస్థల యజమానులతో కమాటిపుర ఇన్‌స్పెక్టర్ ప్రత్యేక సమావేశం

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

నిర్ణీత సమయంలోపు హోటల్..బేకారీస్, ఇతర సంస్థల యజమానులు వ్యాపారాలు నిర్వహించుకోవాలని కమాటిపుర ఇన్‌స్పెక్టర్ తేజావత్ కొమరయ్య సూచించారు. సమయం దాటి రాత్రిళ్లు వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. ఆదివారంనాడు పోలీస్ స్టేషన్ లో కమాటిపురాలోని హోటల్.. బేకారీస్, ఇతర సంస్థల యజమానులతో ఇన్‌స్పెక్టర్ తేజావత్ కొమరయ్య, ఎస్.ఐ. లక్షి సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా వ్యాపార కార్యకలాపాల  సమయ పాలనపై వ్యాపారులకు పలు సూచనలు చేశారు. సకాలంలో అన్ని సంస్థలను మూసివేయాలని వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.  నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారాలు నిర్వహిస్తే అట్టి వ్యాపార యాజమానులపై కేసులు బుక్ చేసి జైలుకు పంపుతామని ఇన్‌స్పెక్టర్  హెచ్చరించారు.  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: