ఈటల రాజేందర్ కు స్వాగతం పలికిన బుక్కా వేణుగోపాల్

పలు గ్రామాల్లో బిజెపి జెండా రెపరెప

బుక్కా వేణుగోపాల్ నేతృత్వంలో పలు పార్టీకి చెందిన నేతలు బిజెపిలో చేరిక

(జానో జాగో వెబ్ న్యూస్- రాజేంద్రనగర్ ప్రతినిధి)

రాజేంద్రనగర్ నియోజకవర్గ శంషాబాద్ మండలంలో పలు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన “బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను బిజెపి రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బుక్కా వేణుగోపాల్ నేతృత్వంలో పలువురు బిజెపి నాయకులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా బుక్కా వేణుగోపాల్ నేతృత్వంలో పలు పార్టీలకు చెందిన  ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు బిజెపిలో చేరారు.


ఆ తరువాత శంషాబాద్ మండలంలోని బుక్కా వేణుగోపాల్ నేతృత్వంలో పలు పార్టీలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులను, ముఖ్య నాయకులను పార్టీలోకి ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేతలంతా పార్టీ బలోపేతం కోసం కృషిచేసి కెసిఆర్ అహాన్ని అణిచివేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బుక్కా వేణుగోపాల్ మాట్లాడుతూ... రాజేంద్రనగర్ నియోజకవర్గం లో బిజెపి పార్టీ బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈటెల రాజేందర్ కు ఆయన కృతజ్ఞతలుu తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: