మోదీ పిలుపుతో ఢిల్లీకి జగన్., చంద్రబాబు..ఒకే వేదిక పంచుకొంటారా


ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబరు 5న ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈ ఏడాది జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కేంద్రం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సదస్సులు, సమావేశాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించే సదస్సుకు రావాలని జగన్, చంద్రబాబులకు పిలుపు అందింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానాలు అందాయి. జీ20 దేశాల సదస్సు తీరుతెన్నులు, అజెండాపై ఈ సమావేశంలో ప్రధాని మోదీ రాజకీయ పార్టీల నేతలతో చర్చించనున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: