ఘనంగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం సదర్భంగా గడివేముల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడివేముల, గని, గడిగరేవుల, కరిమధ్యల లో ఆంధ్ర ప్రదేశ్ అవతరణ కు శ్రీకారం చుట్టిన పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులతో మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16 వ తేదీన పడమటి పల్లె నెల్లూరు జిల్లాలో జన్మించారని, 1952 డిసెంబర్ 15వ తేదీన మద్రాసు రాష్ట్రంలో మరణించారని తెలిపారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష మద్రాసు రాష్ట్రంలోని బులుసు సాంబ మూర్తి ఇంటిలో 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి మరణించారని, ఆ మహనీయుని వలననే మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు శేషమరాజు ,మహబూబ్ బాషా ,రాములు, రవి నాయక్, ప్రకాష్ రెడ్డి ,రామాంజనేయులు, లక్ష్మయ్య,ఇమామ్ వలి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ఘనంగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: