గిరిజనుల హక్కుల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం

గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలో52 జీవోను రద్దు చేయాలంటూ గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. వివరాల లోకి వెళ్తే ట్టడుగున ఉన్న గిరిజనుల కోసం, గిరిజనుల హక్కుల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతామని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్ ధ్వజమెత్తారు. బోయ, బెంతు ఒరియా కులాలను గిరిజనులో కలపవద్దని, జీవో నెంబర్ 52 ను రద్దు చేయాలని గిరిజన ప్రజా సమాఖ్య, విద్యార్థి సమాఖ్య, బంజారా ధర్మసేన ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ ర్యాలీ చేపట్టారు. గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ నాయకత్వంలో వివిధ తండాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు మహిళలు యువకులు పాల్గొన్నారు.

నంద్యాల పట్టణంలోని స్థానిక మునిసిపల్ ఆఫీస్ నుండి సంజీవనగర్ గేట్ మీదుగా శ్రీనివాస సెంటర్ వరకు బంజారా వేషధారణ,  సంప్రదాయాల దుస్తులతో మహిళలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. "52 జీవోను రద్దు" చేయాలంటూ నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాజారాం నాయక్, రవి నాయక్ బాలు నాయక్, రవీంద్ర నాయక్ లు మాట్లాడుతూ వాల్మీకి, బోయ, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం జీవో 52 ను విడుదల చేసిందన్నారు. వీరిని ఎస్టిలో చేర్చితే 32 లక్షల మంది గిరిజన జాతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్ని విధాల అభివృద్ధి చెందిన బి సి ఏ జాబితాలో ఉన్న బోయలను ఎస్టిలో చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం సరైంది కాదన్నారు. అడవి తల్లిని నమ్ముకున్న గిరిజన జాతి బిడ్డలకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, నిరక్షరాష్ట్యత, వెనుకబాటుతనం, నిరుద్యోగంతో కనీసం గూడు నీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజనులపై ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదని మండిపడ్డారు. తాండాలలో, ఎరుకల కాలనీలో, గూడాలలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు లేక దుర్భరమైన జీవితాలు గడుపుతున్నామని, ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల బాగోగాలు పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ జీవో నెంబర్ 52 ను రద్దుచేసి గిరిజన పక్షపాతిగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 10వ తేదీ నుండి జిపిఎస్ ఆధ్వర్యంలో మండల స్థాయి నుంచి జిల్లాల వరకు రాష్ట్రవ్యాప్తంగా జిపిఎస్ పోరు కార్యాచరణ రూపంలో ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిపిఎస్ గౌరవ అధ్యక్షుడు శంకర్ నాయక్, ఉపాధ్యక్షుడు మల్లేష్ నాయక్, బనగానపల్లె ఇన్చార్జి రామచంద్రనాయక్, సుగాలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తిరుపాల్ నాయక్, వెలుగోడు వైస్ ఎంపీపీ కోడావత్ శంకర్ నాయక్, వైఎస్ఆర్సిపి నంద్యాల పార్లమెంట్ విక్రమ్ సింహ నాయక్, శ్రీశైలం ఇన్చార్జి రాము నాయక్, వెలుగోడు మండల స్వామి నాయక్, ఆత్మకూరు మండల ఇన్చార్జి మల్లికార్జున నాయక్,  నందమూరి నగర్ బాల నాయక్, గుంతకందల సుధాకర్ నాయక్, రుద్రవరం వెంకటేశ్వర నాయక్, మహిళ విభాగం భాను భాయి, తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: