నవంబర్ 26న రాజ్యాంగ పరిరక్షణకై ప్రతిజ్ఞలు

   -ఆవాజ్ రాష్ట్ర కమిటి పిలుపు


(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

 రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ,  రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై ప్రతిజ్ఞలు చేయాలని ఆవాజ్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. రాజ్యాంగం  స్వేచ్ఛ, సమానత్వము, సౌబ్రాతృత్వము, సామాజిక న్యాయం అనే నాలుగు మూలస్థంబాలపై ఆధారపడి ఉంది. బిజెపి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికి మూలస్థంబాలుగా ఉన్న ఈ విలువల పైనే దాడి జరిగుతోందని, ఆ దాడి నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26న రాజ్యాంగ ప్రవేశికని చదివి, రాజ్యాంగ పరిరక్షణకై ప్రతిజ్ఞ పూనాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమ్మద్ అబ్బాస్ అన్నారు. ఆవాజ్ రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాదులోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో  ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జబ్బార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్ మాట్లాడారు. దేశంలో విద్వేష రాజకీయాలు పౌరుల మత స్వేచ్ఛను, భావ ప్రకటన స్వాతంత్రాన్ని, సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. ప్రజలు ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలకు అందకుండా చేస్తున్నారని విమర్శించారు. నవంబర్ 26 భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర విలువలు బోధించిన  రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు  కావాలని, మతోన్మాదం నుండి దేశాన్ని, ప్రజలను రక్షించుకోవాలని అన్నారు. మత సామరస్యం, శాంతియుత సహజీవనం, దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రజలందరూ ముందుకు కదలాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహ్మద్ ఖాన్, అతిఖుర్ రెహమాన్, అబ్దుల్ సత్తార్, మహ్మద్ పాషా, మహ్మద్ గౌస్, మహ్మద్ అలీ, సహాయ కార్యదర్శులు షేక్ జహంగీర్,  ఖయ్యూమ్, షేక్ ఇమామ్, అక్మల్ పాష, మహ్మద్ ఖాజా, నశీర్, ఖాజా గరీబ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: