హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ (హెచ్ యు జె) నూతన కమిటీ ఎంపిక

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ (22/23 ) గాను నూతన కమిటీ ఎంపికైంది. ఈ కమిటీ అధ్యక్షుడి తో పాటు ఐదుగురు ఉపాధ్యక్షులు, ఒక కార్యదర్శి, ఆరుగురు సహాయ కార్యదర్శులు, ట్రెజరర్, ఆర్గనైజర్ సెక్రెటరీ, కల్చరల్ సెక్రెటరీ తో పాటు 15 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎంపికయ్యారు. సోమవారం నాడు హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు హెచ్ యూజె రెండవ మహాసభ జరిగింది. జర్నలిస్టుల సమస్యలు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇతరత్రా సమస్యలపై మహాసభలో చర్చించారు.


అనంతరం హెచ్ యజే నూతన కమిటీ ఎంపికైంది. హెచ్ యుజే నూతన కమిటీ అధ్యక్షుడిగా సిగ శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా వి వెంకటాచారి, నయీమ్ వజాహత్, ఎల్ లక్ష్మణ్ యాదవ్, అక్తర్ హుస్సేన్, జేపీ చారి, కార్యదర్శిగా తాజా అబ్దుల్ హమీద్(సౌకత్),  సహాయ కార్యదర్శులుగా  కె. మహేందర్ రెడ్డి, అదిల్ అహ్మద్ ఖాన్, భరతాచారి, ఎన్.మల్లికార్జున్రెడ్డి,  కే సంతోష్ కుమార్, షేక్ రఫీ ఉద్దీన్, కోశాధికారిగా కే శ్రవణ్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శిగా సయ్యద్ ఇబ్రహీం అలీ, కల్చరల్ కార్యదర్శిగా ఎం అమరేశ్వర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా కే శ్రీనివాస్ రెడ్డి, టీ.నాగరాజు గుప్తా, సాజిదా బేగం, సయ్యద్ గౌస్ మోహిఉద్దిన్, బీ.వెంకట్, ఎస్ ఎస్ కె హుసేని ఇక్బాల్, ప్రతిభాదేవి, కే మల్లేష్, మహమ్మద్ సుల్తాన్ , ముత్యాల శ్రీనివాస్, పి శ్రీనివాస్ రెడ్డి, సి గిరిబాబు, వీ సాయిరాం, సిహెచ్ పవన్, ప్రకాష్ తదితరులు ఎంపికయ్యారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: