2022లో చక్కటి మూడో త్రైమాసికంతో లానెక్సెస్

2.185 బిలియన్ యూరోలతో ఏటేటా ప్రాతిపదికన 38.2% వృద్ధి చెందిన విక్రయాలు

అన్ని విభాగాల్లోనూ విక్రయాల వృద్ధి – మరీముఖ్యంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ పటిష్ఠం

ఈబీఐటీడీఏ ప్రి ఎక్సెప్షనల్స్ 4.8 శాతం పెరుగుదలతో 240 మిలియన్ యూరోలకు చేరిక

పెరిగిపోయిన ముడిపదార్థాలు, ఎనర్జీ ధరలు విజయవంతంగా బదిలీ

2022 ఆర్థిక సంవత్సరానికి గైడెన్స్ నిర్దేశం: ఈబీఐటీడీఏ ప్రి ఎక్సెప్షనల్స్ 900 మిలియన్ యూరోల నుంచి 950 మిలియన్ యూరోల మధ్యలో ఉండగలవని అంచనా


(జానో జాగో వెబ్ న్యూస్-బిజినేస్ బ్యూరో)

ఈ ఏడాది మధ్య కాలంలో మేం, ఐఎఫ్ఎఫ్ నుంచి మైక్రోబియల్ కంట్రోల్ బిజినెస్ ను స్వాధీనం చేసుకోవడం ద్వారా మా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ విభాగాన్ని పటిష్ఠం చేసుకున్నాం. గత త్రైమాసికంలోనే దీనికి సంబంధించిన చక్కటి ఫలితాలు వెలువడడం మొదలైంది’’ అని అన్నారు. ‘‘అయినప్పటికీ, కొన్ని విభాగాల్లో డిమాండ్ తగ్గిపోవడం, విక్రయ పరిమాణాల్లో క్షీణతను కూడా మేం గమనించాం. నాలుగో త్రైమా సికంలో ఎనర్జీ ధరలు పెరగడం,: ఎనర్జీ, ముడి పదార్థాల వ్యయాలు అధికం కా వడం కొనసాగుతున్న సవాళ్ల పరిస్థితుల్లోనూ, స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ లానెక్సెస్ 2022 మూడో త్రైమాసికానికి చక్కటి ఫలితాలను అందించింది. విక్ర యాలు గణనీయంగా 38.2 శాతం పెరిగాయి. గత ఏడాది త్రైమాసికంలో 1.581 బిలియన్ యూరోలుగా ఉన్న విక్రయాలు 2.185 బిలియన్ యూరోలకు చేరుకు న్నాయి. ఈబీఐటీడీఏ ప్రి ఎక్సెప్షనల్స్ 4.8 శాతం పెరుగుదలతో 240 మిలియన్ యూరోలకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది ఈ మొత్తం 229 మిలి యన్ యూరోలుగా ఉండింది.

అడిటివ్స్ కార్యకలాపాలకు తోడుగా, ఇటీవల కొన్ని ఏళ్లుగా ఈ గ్రూప్ వ్యూహాత్మకంగా నిర్మించుకుంటూ వచ్చిన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ విభాగంలో వృద్ధి ఎంతో సానుకూలంగా ఉంది. 2022 జులై 1 నాటికి, అమెరికన్ కంపెనీ ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రన్సెస్ (ఐఎఫ్ఎఫ్) నుంచి స్వాధీనం చేసుకున్న మైక్రోబియల్ కంట్రోల్ బిజినెస్  ఇప్పటికే ఈ విభాగంలో చక్కటి ఆదాయాలకు గణనీయ తోడ్పాటును అందించింది. అదే విధంగా ఎమరాల్డ్ కలామా కెమికల్ 2021లో స్వాధీనం చేసుకోబడింది.

ఎనర్జీ, ముడిపదార్థాల వ్యయాల్లో చోటు చేసుకున్న పెంపును లానెక్సెక్ అధిక విక్రయాల ధరల ద్వారా బదిలీ చేసింది. మారకపు రేట్లు కూడా అన్ని విభాగాల్లో ఆదాయాలపై సానుకూల ప్రభావాన్ని కనబర్చాయి. నిర్మాణం వంటి కొన్ని కస్టమర్ పరిశ్రమల్లో డిమాండ్ బలహీనపడింది. ఈబీఐటీడీఏ మార్జిన్ ప్రి ఎక్సెప్షనల్స్ మూడో త్రైమాసికంలో 111.0 శాతం తగ్గాయి. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 14.5 శాతంగా ఉండింది.


ఈ సందర్భంగా లానెక్సెస్ ఏజీ బోర్డ్ ఆఫ్ మేనేజ్ మెంట్ చైర్మన్ మాతియాస్ జాచెర్ట్ మాట్లాడుతూ, ‘‘మా వ్యూహం సరైన దిశలోనే ఉన్నట్లుగా ఈ చక్కటి గణాంకాలు సూ చిస్తున్నాయి.  సమస్యల కాలంలో మేం గతంలో కన్నా మరింత నిలకడగా ఉన్నాం. తక్కువ సైక్లికల్ స్పెషాలిటీ కెమికల్స్ పై మేం ప్రధానంగా దృష్టి పెట్టడం ఇందుకు తోడ్పడింది. ఆర్థిక మాంద్యం చోటు చేసుకునే ముప్పు కారణంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది’’ అని అన్నారు. 

విభాగాలు: పెరిగిపోతున్న విక్రయ ధరలతో ముందుకెళ్తున్న అమ్మకాలు

పెరిగిపోతున్న ముడిసరుకు ధరలను బదలాయించడంతో అడ్వాన్స్ డ్ ఇంటర్మీడి యేట్స్ విభాగం అధిక విక్రయ ధరలను సాధించింది. దాంతో 2022 మూడో త్రైమాసికంలో అధిక విక్రయాలు చోటు చేసుకున్నాయి. ఇవి 492 మిలియన్ యూ రోల నుంచి 30.5 శాతం పెరిగి 642 మిలియన్ యూరోలకు చేరుకున్నాయి. మారక పు రేట్లలో మార్పులు కూడా విక్రయాలపై సానుకూల ప్రభావాన్ని కనబర్చాయి. ఈ విభాగం ప్రి ఎక్సెప్షనల్స్ గత ఏడాది గణాంకాలైన 80 మిలియన్ యూరోలతో పోలిస్తే 18.8 శాతం తగ్గి 65 మిలియన్ యూరోలకు చేరుకున్నాయి.  

2022 మూడవ త్రైమాసికంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ విభాగం విక్రయాలు,  ఆదాయా లు ముఖ్యంగా సానుకూలంగా అభివృద్ధి చెందాయి. ఐఎఫ్ఎఫ్   మైక్రోబియల్ కంట్రోల్ మరియు ఎమరాల్డ్ కలామా కెమికల్ యొక్క కొత్తగా కొనుగోలు చేసిన వ్యాపారాలు ఇక్కడ గణనీయమైన సహకారాన్ని అందించాయి. అమ్మకాలు 60.7 శాతం పెరిగి  662 మిలియన్ల యూరోలకు చేరాయి, అంతకుముందు సంవత్సరంలో 412 మిలియన్ల యూరోలుగా ఉన్నాయి. సెగ్మెంట్ యొక్క ఈబీఐటీడీఏ ప్రీ ఎక్సప్షనల్స్ 110 మిలియన్ల యూరోలకు చేరుకుంది, ఇది మునుపటి సంవత్సరం 66 మిలియన్ల యూరోల సంఖ్యతో పోలిస్తే 66.7 శాతం పెరిగింది. ఈబీఐటీడీఏ మార్జిన్ ప్రీ ఎక్సప్స నల్స్ 16.6 శాతానికి చేరుకుంది, ఇది మునుపటి సంవత్సరంలో 16.0 శాతంగా ఉంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: