విద్యతోనే భవిష్యత్ బంగారు బాట

అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో వక్తలు

తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ సైదాబాద్ బాలుర-1 జూనియర్ కళాశాలలో ఘనంగా కలాం జయంతి వేడుకలు

విద్యతోనే భవిష్యత్తు బంగారు బాట అవుతుందని అబుల్ కలాం జయంతి వేడుకల్లో వక్తలు అభిప్రాయపడ్డారు. విద్యే జీవితంలో ఉన్నత శిఖరాలను చేర్చుతుందని వారు పేర్కొన్నారు. శుక్రవారంనాడు టీఎంఆర్ జేసీ సైదాబాద్ బాలుర-1 జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ఎల్. శివరాణి అధ్యక్షతన అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన జానో జాగోో (ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు విద్య అని అబుల్ కలాం ఆజాద్ పేర్కొన్నారని, ఆయన స్పూర్తిని యావత్తు ముస్లిం సమాజం తీసుకొని ముందుకెళ్లాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఒక ముస్లిం కచ్చితంగా విద్యను అభ్యసించే సంకల్పంతో ముందుకెళ్లాలని ఆయన కోరారు.


అన్ని వర్గాల విద్యాభ్యున్నతికి అబుల్ కలాం ఆజాద్ కృషిచేశారని ఆయన కొనియాడారు. టీఎంఆర్ఆ సీ హైదరాబాద్ర్ ఆర్ఎల్సీ-2 విజయ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలోె అనేక ప్రఖ్యాత విద్యా సంస్థలను, యూనివర్శటీలను మౌలానా అబుుల్ కలాం ఆజాద్ స్థాపించారని కొనియాడారు. దేశ విముక్తికోసం పోరాడుతూనే .  విద్యా వికాశం కోసం అబుల్ కలాం ఆజాద్ నిరంతరం పాటుపడ్డారని పేర్కొన్నారు. ఆయన స్పూర్తితో ముందుకెళ్లడమే మనం ఆయనకిచ్చే గౌరవమని అని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా అకాడమిక్ కో ఆర్డినేటర్ ఫరా ఫాతిమా మాట్లాడుతూ..బహు భాషా కోవిదుడిగా..పేరుగాంచిన విద్యావేత్తగా ఈ దేశానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలందించారని పేర్కొన్నారు.

అందుకే ఆయన జన్మదినాన్ని పురష్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తారని వెల్లడించారు. టీఎంఆర్ జేసీ సైదాబాద్ బాలుర-1 జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ఎల్ శివరాణి మాట్లాడుతూ... మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్పూర్తితో మైనార్టీ రెసిడెన్షీయల్ స్కూల్ విద్యార్థులు డాక్టర్లుగా..ఇంజనీర్లుగా...మంచి ఉన్నత ఉద్యోగులుగా రాణించాలన్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి తెలంగాణ రాష్ట్ర సర్కార్ పేద మైనార్టీల కోసం ఈ కార్పోరేట్ తరహా రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించిందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమ జూనియర్ కళాశాలలో చదవిన పలువురు విద్యార్థులకు 20022-23 విద్యా సంవత్సరానికి గానూ ఉచితంగా డిగ్రీలో ప్రవేశం లభించిందని ఆమె వెల్లడించారు. అబ్దుల్ నాసర్ అనే విద్యార్థి ఎన్డీఏ కు సెలెక్ట్ అయ్యాడని కూడా ఆమె తెలిపారు. 

జాతీయ స్థాయి ఫ్లయింగ్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు 

 అనంతరం జాతీయ స్థాయిలో నవంబర్ 25, 27 వ తేదీల్లో జరిగే ఫ్లయింగ్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు కె.బాలు(బైపీసీ-2), మొహమ్మద్ అబ్దుల్ హమీద్(ఎంపీపీ-1),   మహమ్మద్ అబ్దుల్ సైఫ్ (బైపీసీ-2), మోహమ్మద్ ఇబ్రహీ(బైపీసీ-2), సయ్యద్ సోహెల్ మెహుముదీ (బైపీసీ-2) లను ఆర్ఎల్సీ-2 విజయ కుమార్ అబినందించారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లతోపాటు నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






 



 







 




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: