నందిని ఎలక్ట్రికల్ షాపు లో అగ్నిప్రమాదం

12 లక్షల ఆస్తి నష్టం

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాలలోని 10వ వార్డు బైర్మల్ వీధి లోని శశి మెడికల్ దగ్గర సాయంకాలం సుమారు 8 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనందిని ఎలక్ట్రికల్ షాపు లో అగ్ని ప్రమాదం జరిగింది. షాప్ లో ఉన్న ఎలక్ట్రికల్ సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిన విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ప్రక్కన ఉన్న షాపులకు వ్యాప్తి చెందకుండా అదుపులోకి  తెచ్చారు. కాలిపోయిన ఎలక్ట్రికల్ వస్తువుల విలువ సుమారు 12 లక్షలు ఉంటుందని షాపు యజమాని టి డి పి 10 వార్డు ఇంచార్జి గోవిందనాయుడు  తెలిపారు.

 




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: