గ్రంథాలయ అభివృద్ధికి 10,000/- విరాళం ప్రకటించిన..

శ్రీ రాజరాజేశ్వరి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రామేశ్వరరావు


(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక గడివేముల లోని గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను గ్రంథాలయాధికారి వెంకటేశ్వర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ వారోత్సవాలకు ముఖ్యఅతిథిగా శ్రీరాజరాజేశ్వరి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రామేశ్వరరావు నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉద్యమంలో జవహర్ లాల్  నెహ్రు చురుకుగా పాల్గొనేవారని, పిల్లలను, యువకులను బాగా ప్రోత్సహించేవారని, సంపూర్ణ స్వరాజ్యమే తన లక్ష్యమని స్వాతంత్రంలో నెహ్రు ముఖ్యపాత్ర పోషించారని తెలిపారు.


పిల్లలు, విద్యార్థినీ విద్యార్థులు విజ్ఞానాన్ని పెంచుకునేందుకు గ్రంథాలయాభివృద్ధికి తనవంతుగా 10,000 రూపాయలు విరాళం ప్రకటించారు.గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధికి పదివేల రూపాయలు విరాళంగా ప్రకటించిన శ్రీ రాజరాజేశ్వరి ప్రధానోపాధ్యాయులు రామేశ్వరరావు గారికి గ్రంథాలయ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులతో విజ్ఞాన సమపార్జన ప్రతిజ్ఞ చేయించిన అనంతరం పాఠశాల విద్యార్థిని, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు,పాఠకులు, గ్రామ ప్రజలు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: