ఫార్మాటివ్ 1 పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ... 

గడివేముల ఎంఈఓ రామకృష్ణుడు


(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని గని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఫార్మేటివ్ 1, పరీక్షా కేంద్రాన్ని  ఎంఈఓ రామకృష్ణుడు పరిశీలించారు, పరీక్షల నిర్వహణ గురించి పలు సూచనలు చేశారు, అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సంవత్సరము ఫార్మేటివ్ వన్ ను క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్  గా నిర్వహించడం జరుగుతుందని, పరీక్షల కు ప్రశ్నాపత్రాన్ని ప్రభుత్వమే అందజేస్తుందని, 1 నుంచి 8వ తరగతి వారు జవాబును ఆబ్జెక్టివ్ తరహాలో ఓఎంఆర్ సీట్లో  నమోదుచేయవలసి ఉంటుందని, ఓఎంఆర్ షీట్లను విద్యార్థి పేరుతో సహా ప్రభుత్వమే ఇస్తుందని, అలాగే పరీక్షలు అనంతరము  ఓఎంఆర్ షీట్లను జిల్లా కేంద్రానికి పంపి,


రాష్ట్ర కార్యాలయంలో మూల్యాంకనం జరుగుతుందని అనంతరము మార్కులను ఆన్లైన్లో పొందుపరుస్తారని, దీని ద్వారా విద్యార్థుల ప్రగతి తెలుస్తుందని తెలిపారు, పరీక్షలను మండలంలోని అన్ని పాఠశాలల్లో 1  నుండి 10 వ తరగతి వరకు  చదువుతున్న పిల్లలకు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరము జిల్లా పరిషత్  ఉన్నతపాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: