ఖండాంతరాలు దాటిన పిస్తా హౌస్ ఖ్యాతి
పిస్తా హౌస్ హలీం కు'వేరీ పాపులర్ ఫుడ్ ఇన్ ఇండియా' (జీఐ) సర్టిఫికెట్
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర రాజధాని కేంద్రమైన హైదరాబాద్ లోని పిస్తా హౌస్ ఆహార ఉత్పత్తులు మన దేశంలోనే కాకుండా దేశ విదేశాలలో ఖ్యాతి గడిచింది. ఈ నేపథ్యంలో పిస్తా హౌస్ తయారు చేసే హైదరాబాద్ హలీంకు కేంద్ర ప్రభుత్వ 'వేరీ పాపులర్ ఫుడ్ ఇన్ ఇండియా' (జీఐ) సర్టిఫికెట్ లభించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్య క్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పియూష్ గోయల్ పిస్తా హౌస్ చైర్మన్ ఎం.ఎ. మజీద్ కు సర్టిఫికేట్, నగదు పుర స్కారాన్ని అందజేసి అభినందించారు. నాణ్యమైన, రుచికరమైన, ఎన్నో పోషక విలువలు గల హైదరాబాద్ హలీమ్ తయారీతో దేశం పేరును దేశవిదేశాలలో చాటిన మజీద్ కృషిని ప్రశంసించారు.
Home
Unlabelled
ఖండాంతరాలు దాటిన పిస్తా హౌస్ ఖ్యాతి .. పిస్తా హౌస్ హలీం కు'వేరీ పాపులర్ ఫుడ్ ఇన్ ఇండియా' (జీఐ) సర్టిఫికెట్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: