గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినం సందర్భంగా

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నంద్యాల సబ్ జైల్లో మినరల్ వాటర్, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు

ప్రారంభించిన నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి, జైల్ సుపరిండెంట్ గురు ప్రసాద్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా ఖైదీల సంక్షేమ దినం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ నంద్యాల జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో ఖైదీల సౌకర్యార్థం మినీ ఆర్ఓ వాటర్ ప్లాంట్, మెడికల్ వీల్ చైర్లను సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఎండి, రెడ్ క్రాస్  మినీ ఆర్ఓ ప్లాంట్ ను సాఫ్ట్వేర్ ఉద్యోగి, రెడ్ క్రాస్ సభ్యుడు షాషావలి సహకారంతో అందజేశారు , ఖైదీల సౌలభ్యం కోసం వీల్ చైర్ ను సేవెన్ హిల్స్ హాస్పిటల్ ఎండి, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ మారుతి కుమార్ సహకారంతో అందజేశారు.


ఈ కార్యక్రమంలో నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి, సబ్ జైల్ సూపరింటెండెంట్ గురుప్రసాద్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల, వైస్ చైర్మన్ మారుతికుమార్, సెక్రెటరీ మమతారెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు  ఉస్మాన్ బాషా, యాకూబ్, మద్దిలేటి, మండల చైర్మన్ నాగేశ్వర్రెడ్డి, సభ్యులు నూర్ భాష, మండల లీగల్ లిటరసీ న్యాయవాదులు .శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, కోర్టు సిబ్బంది రామచంద్రా రెడ్డి, రెడ్ క్రాస్ డిఎఫ్ఓ రాజు నాయక్ తదితరులు మాట్లాడుతూ  ఖైదీలు తాము చేసిన నేరాల పట్ల పరివర్తన చెంది, మంచి మానవత్వం కలిగిన మనుషులుగా జీవించాలని కోరారు.అహింసా, శాంతి, సత్యం అనే మహాత్మా గాంధీ సిద్ధాంతాలను పాటించాలని హితవు పలికారు. జైల్ ఆవరణంలో ముఖ్య అతిథులు చేతుల మీదుగా మొక్కలను నాటి పర్యావరణ సంరక్షణ బాధ్యత మనదే అని తెలిపారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: