ద‌స్త‌గిరి ఆరోప‌ణ‌ల్లో ఎలాంటి వాస్తవం లేద‌ు: కడప ఎస్పీ


వై.ఎస్. కేసులో అప్రూవర్ గా మారిన ద‌స్త‌గిరి చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో ఎలాంటి వాస్తవం లేద‌ని కడప జిల్లా ఎస్పీ అన్బురాజ‌న్ పేర్కొన్నారు. ద‌స్త‌గిరికి కేటాయించిన గ‌న్‌మ‌న్ల‌ను మార్చ‌డం పాల‌నాప‌ర‌మైన అంశ‌మేన‌ని, అందులో ప్ర‌త్యేకత ఏమీ లేద‌ని తెలిపారు. అంతేకాకుండా ఇటీవ‌లే తొండూరులో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ సంద‌ర్భంగా గ‌న్‌మ‌న్లు స‌రిగా స్పందించ‌లేద‌ని ఆయ‌న తెలిపారు. అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే గ‌న్‌ మ‌న్ల‌ను మార్చామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

ఇదిలావుంటే వైసీపీ నేత‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి సోమ‌వారం పోలీసుల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు పొంచి ఉన్న ముప్పు గురించి విన్న‌విస్తూ భ‌ద్ర‌త‌ను పెంచాల‌న్న త‌న విజ్ఞ‌ప్తుల‌ను క‌డ‌ప జిల్లా ఎస్పీ పట్టించుకోవ‌డం లేద‌ని అత‌డు చెప్పాడు. అంతేకాకుండా త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని, త‌న‌కు ఏం జ‌రిగినా సీఎం జ‌గనే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని కూడా అత‌డు ఆరోపించాడు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: