నంద్యాల జిల్లా వ్యాప్తంగా కస్తూరిబా పాఠశాలల..
సిబ్బందిని , ఎస్ఓ , టీచర్లను మార్పులు చేర్పులు చేయాల్సిందే.!
మారని ఉపాధ్యాయుల తీరు.!
బండిఆత్మకూరు కస్తూరిబా పాఠశాల ఎస్ఓ , టీచర్లపై చర్యలేవీ
రాయలసీమ విద్యార్ధి - యువజన సంఘాల జేఏసీ నేతలు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
బండిఆత్మకూరు కస్తూరిబా పాఠశాల ఎస్ఓ , ఉపాధ్యాయులను సస్పెండు చేయాలనీ - విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన 25 రోజులవుతున్నా చర్యలు తీసుకోని విద్యాశాఖ అధికారులపై సైతం చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ గారికి వినతిపత్రం అందజేసిన జేఏసీ నేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 రోజులు నంద్యాల జిల్లా వ్యాప్తంగా జేఏసీ నేతలు ఉధ్యమం చేస్తున్నా పాఠశాలలో ప్రక్షాళన కాకుండా, జిల్లా వ్యాప్తంగా నెలనెలా మామూళ్లు అందుతున్నాయని బహిరంగ ఆరోపణలు చేశారు.
మామూళ్ల మత్తులో పడి తప్పుచేసినా , విద్యార్ధినీల ఆహార పదార్ధాలు అమ్ముకున్నా,విద్యార్ధినిలను ఇబ్బందులకు గురిచేసినా నామమాత్రపు తనిఖీలు నిర్వహించి నెలనెలా , తనిఖీలకు వెళ్లినప్పుడు ముడుపులు పుచ్చుకుంటున్న పై స్ధాయి విద్యాశాఖ అధికారులు. 20-10-22 మరియు21-10-22 తేదీలలో *""హాస్టల్ విద్యార్ధుల భరోసా దీక్ష""* పేరుతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా కస్తూరిబా, సంక్షేమ హాస్టళ్లు , గురుకుల పాఠశాలల సమష్యలపై కలెక్టర్ కార్యాలయం ఎదుట 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.
నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో విద్యార్ధినీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని , పౌష్ఠికరమైన ఆహారాన్ని అందించాలని, ఉన్నతాధికారులు తనిఖీలకి వచ్చినప్పుడు నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారని, విద్యార్థిని, విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి పౌష్టికారాన్ని అందించడం లేదని, గత నెల బండిఆత్మకూరు కస్తూరిబా పాఠశాలలో ఎస్ఓ , తోటి ఉపాధ్యాయుల తీవ్ర వేధింపులు భరించలేక విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం సంఘటనలో 25 రోజులు గడుస్తున్నా బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు ఘోరంగా విఫలమయ్యారనీ , సాక్షాత్తు విద్యార్ధినియే వేధిస్తున్నారనీ , కాళ్లు - చేతులు ఒత్తించుకుంటున్నారనీ, నానా దుర్భాషలాడుతూ, కొడుతున్నారనీ బహిర్గతం చేసినప్పటికీ సంబంధిత జిల్లా స్ధాయి విద్యాశాఖ అధికారులు బండిఆత్మకూరు కస్తూరిబా పాఠశాల ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటనీ ,
దీనిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన జిల్లా స్ధాయి విద్యాశాఖ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని , విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి కారణమైన బండిఆత్మకూరు కస్తూరిబా పాఠశాల ఎస్ఓ , ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని కోరుతూ నేడు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్రీ. మనజీర్ జిలానీ సామూన్ గారికి రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ నేతలు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ చైర్మన్ రామినేని రాజునాయుడు , కన్వీనర్లు పూల వెంకట్ , పాపసాని వేణు రెడ్డిలు మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కేజీబీవీ పాఠశాలలో విద్యార్ధినీలకు నాణమైన ఆహారాన్ని అందించి , కనీస సౌకర్యాలు కల్పించాలనీ , బండిఆత్మకూరు కస్తూరిబా పాఠశాలలో విద్యార్ధిని ఆత్యహతాయత్నం చేసుకున్న ఘటన 25 రోజులు అవుతున్నా దీనిపై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటన్నారు . జిల్లా వ్యాప్తంగా కస్తూరిబా , సాంఘీక సంక్షేమ హాస్టళ్లు , గురుకుల పాఠశాలల విద్యార్ధినీ - విద్యార్ధుల సమష్యలపై హాస్టల్ విద్యార్ధి భరోసా దీక్ష పేరుతో ఈనెల 20-10-22 నుండి 21-10-22 తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 48 గంటల పాటునిరాహార దీక్షలు చేయనున్నట్లు వారు తెలిపారు.
Home
Unlabelled
నంద్యాల జిల్లా వ్యాప్తంగా కస్తూరిబా పాఠశాలల.. సిబ్బందిని , ఎస్ఓ , టీచర్లను మార్పులు చేర్పులు చేయాల్సిందే.!--రాయలసీమ విద్యార్ధి - యువజన సంఘాల జేఏసీ నేతలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: