రికార్డింగ్ డ్యాన్స్...అర్కేస్ట్రాలకు అనుమతి లేదు

గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య హెచ్చక

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

దసరా, దీపావళి పండుగల సమయంలో రికార్డింగ్ డ్యాన్స్ లు..ఆర్కేస్ట్రా వంటి కార్యక్రమాలకు అనుమతిలేదని గడివేముల పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ఎల్.కే.తాండలో రికార్డింగ్ డ్యాన్స్ సందర్భంగా చోటు చేసుకొన్న అవాంచనీయ పరిణామాల నేపథ్యంలో గడివేముల పోలీసులు ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇదిలావుంటే గడివేముల మండల పరిధిలోని ప్రతి గ్రామంలో దసరా, దీపావళి పండుగలు ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య కోరారు. పండుగల సందర్భంగా  గ్రామలలో ఎటువంటి ఆర్కెస్ట్రాలు గాని, రికార్డ్ డాన్స్ లకు అనుమతి లేదని ఆయన స్పష్టంచేశారు. గతంలో ఎల్.కె.తాండ వాసులు దీపావళి పండుగ సందర్భంగా రికార్డ్ డాన్స్ లు పెట్టుకొనే విషయంలో కొన్ని అనుకోని అవాంఛనీయ సంఘటనలు  జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన వెల్లడించారు. గడివేముల మండలం లోని అన్ని గ్రామాల ప్రజలు ఆనందంగా, సంతోషంగా పండగలు జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఎట్టి పరిస్థితిలోనూ   రికార్డ్ డాన్స్, ఆర్కెస్ట్రాలకు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించామని ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య వెల్లడించారు. పొరపాటున కూడా ఆర్కెస్ట్రా, రికార్డింగ్ డాన్స్ నిర్వహించకూడదని ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో ఎవరైనా అతిక్రమించి ఆర్కెస్ట్రా, రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తే అట్టివారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొంటామని ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య స్పష్టంచేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: