ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ప్రారంభించిన జిల్లా సహాయ కార్యదర్శి ధనంజయుడు

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు. నంద్యాల జిల్లా లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విద్యార్థులతో కలసి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటాలు కొనసాగిస్తూ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే ధ్యేయంగా, చదువు పోరాడు అనే నినాదంతో విద్యార్థుల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఏఐఎస్ఎఫ్ జెండా ఉంటుందనే నమ్మకాన్ని విద్యార్థుల్లో కలిగించి


,విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నటు వంటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు 80 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ శాస్త్రీయ విద్యా విధానమే లక్ష్యంగా పనిచేస్తుందని వారు తెలియజేశారు. విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తూ సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, హాస్టళ్లలోని విద్యార్థులు అందరికీ సన్న బియ్యం సరఫరా చేయాలని,ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లను "నాడు-నేడు" కింద అభివృద్ధి చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థుల మెస్, కాస్మొటిక్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని,హాస్టల్  విద్యార్థులకు 2018 మెనూ రద్దు చేసి 2022 నూతన మెనూ అమలు చేయాలని,

ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం,టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాలలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని  పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రిస్వామి, నంద్యాల పట్టణ ఆర్గనైజింగ్ కార్యదర్శి మనోహర, నాయకులు లోకేష్, రమణ తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: