టిఆర్ఎస్ తోని అభివృద్ధి సాధ్యం

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి) 

టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాడు మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని 21, 22  23 వ వార్డులలో రూ .75 లక్షల వ్యాయామంతో కూడిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బీటీ రోడ్, సిసి రోడ్డు పనులకు మంత్రి సబితా రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధిని వేగం పట్టించారని ఆమె వెల్లడించారు. అభివృద్ధికి చిహ్నం టిఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి సబితా రెడ్డి పేర్కొన్నారు.





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: