నష్టపోయిన పత్తి రైతులకు..

ఎకరాకు 40 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి 

 ఏపీ రైతు సంఘం డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

 నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలంలో ఏపీ రైతుసంఘం నాయకులు పత్తి పంటను పరిశీలించారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా నాయకులు భాస్కర్ రెడ్డి లు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులు నంద్యాల జిల్లా లోని  నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలు పత్తి పంటలు సాగు చేశారని, కల్తీ విత్తనాలు వేయడంతో పంట దిగుబడి రాక రైతులు అప్పుల పాలు అయ్యరని, కల్తీ విత్తనాల పైన వ్వవసాయ శాఖ అధికారులు జోక్యం చేసుకోక పోవడంతో విచ్చలవిడిగా అధిక ధరలకు విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తున్నారని, జిల్లా వ్వవసాయ శాఖ అధికారులు నకిలీ విత్తనాల ప్రైవేటు కంపెనీల పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.


కౌలు రైతులు కూడా భూమిని కౌలుకు తీసుకొని పెట్టుబడి పెట్టి కౌలు గుర్తింపు కార్డు లేక బ్యాంకు రుణాలు అందడం లేదనీ ఈ క్రాప్ లో పంట నమోదు లేక కౌలు రైతు నష్టపోతున్నారని, అతివృష్టి,అనావృష్టి వల్ల భారీ వర్షాల వల్ల దోమ కాటుతో పత్తి ఎర్ర తెగులుతో పూత కాయలు రాలిపోవడం జరుగుతుందని, నాణ్యమైన విత్తనాలు లేక నకిలీ విత్తనాలతో పంట పెరిగి దిగుబడి రావడం లేదని, పత్తి పంటలను వ్వవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలతో పరిశీలన జరిపి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని లేకపోతే పత్తి రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు రామకృష్ణ, సిఐటియు నాయకులు గోపాలకృష్ణ పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: