పుస్తకాలు లేకుండా చదవడం ఎలా
ఎస్ఎఫ్ఐ నాయకుల ధర్నా
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా లో పాఠశాలలు, కళాశాలలు తెరిచి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్న పాఠ్యపుస్తకాలు లేకుండా చదవడం ఎలా అని ప్రశ్నిస్తూ నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు మధు కిరణ్,ఓబులేస్ లు మాట్లాడుతూ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పుస్తకాలు ఆందలేదని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం లేదని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) ఆరోపించారు. పాఠశాలలు, కళాశాలలు తెరిచి నాలుగు నెలలు అవుతున్నా నేటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పార్టీ పుస్తకాలు అందజేయలేదని పుస్తకాలు లేకుండా విద్యార్థులు ఎలా చదువుతారని, జగనన్న విద్యా కానుక అని పథకం ఉన్నా విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు అందడం లేదని ,విద్యార్థులకు 4 నాలుగు నెలలు ఆఈనా అందలేదని,
ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు దాదాపు 7 సంవత్సరాల నుండి టెస్ట్ బుక్ లు అందలేదని, టెక్స్ట్ బుక్ లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు పూర్తిస్థాయిలో పుస్తకాలు ఆందించాలాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ నాయకులు గోపాల్,మదు, మహేష్,కుమార్, ఎస్ఎఫ్ఐ ఇతర నాయకులు పాల్గొన్నారు.
Home
Unlabelled
పుస్తకాలు లేకుండా చదవడం ఎలా... ఎస్ఎఫ్ఐ నాయకుల ధర్నా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: