పేదల చెంతకు  వైద్యం తెచ్చిన సీఎం కేసీఆర్

బస్తీ దవాఖాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-రంగారెడ్డి జిల్లా  ప్రతినిధి)

మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24 వ డివిజన్ గ్రామ బురుజు వద్ద ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యా, వైద్యా రంగాలకు పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు. నగరంలో వైద్యం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు మాత్రమే ఉండగా, నగర శివారు ప్రాంతాల్లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని వెల్లడించారు. ఒక్కో ఆస్పత్రిని రూ.200 కోట్లతో మహేశ్వరం-ఎల్ బి నగర్ నియోజకవర్గాల పరిధిలో గడ్డి అన్నారం వద్ద,  మేడ్చల్,  సనత్ నగర్, గచ్చిబౌలిలలో వీటిని నెలకొల్పనున్నారని ఆమె తెలిపారు. పట్టణాల్లో బస్తీ దవాఖానాలు, గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తూ ప్రజల చెంతకు వైద్యాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆమె కొనియాడారు. హైదరాబాద్ లో ఇప్పటికే 300 పైచిలుకు, రంగారెడ్డి జిల్లాలోని మునిసిపాలిటీలలో మొదటి దశలో 22 , రెండవ దశలో 14 మొత్తం 36 బస్తీ దవాఖానాలు మంజూరు అయ్యాయని ఆమె తెలిపారు.


మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో మొత్తం 10 బస్తీ దవాఖానాలు మంజూరు కాగా,  ఇందులో  జల్ పల్లి, తుక్కుగూడా మునిసిపాలిటీలతో పాటు మీర్పేట్, బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్లలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రతి బస్తీ దవాఖానలో ఒక డాక్టర్,స్టాఫ్ నర్స్,నర్స్ లు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని,  ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ,పేద వారికి ఉచితంగా వైద్యం అందించటానికి ఈ దవాఖానాలు ఎంతగానో దోహదంచేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి, కార్పోరేటర్లు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: