చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే పండుగా...

మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో మరిన్ని ప్రగతి కాంతులు నింపుతున్నదని మంత్రి పేర్కొన్నారు. చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే పండుగగా ప్రజలు దీపావళి పండుగ జరుపుకుంటారని అన్నారు. దీపావళి పండుగ చెడుపై ధర్మానికి విజయమన్నారు. దీపావళి మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని, కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తుందని అన్నారు. అందరూ జాగ్రత్తగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా పండుగ జరుపుకోవాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ మరిన్ని ప్రగతి కాంతులు నింపాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఆకాంక్షించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: