నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి

ఏపీ రైతు సంఘం డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల  జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని కొనిదేడు, భూపనపాడు, నేరవాడ గ్రామాల్లో వేద సీడ్స్ తడాఖా, ప్రబాత్ సీడ్స్ కంపెనీ లకు చెందిన పత్తి విత్తనాలు నాటి 150 రోజులు గడిచిన  పూత,కాపు ,కాయలు రాక పంట నష్టం జరిగిందని,పంట నష్టం జరిగిన గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, నంద్యాల జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి రామచంద్రుడు,  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ , సి ఐ టి యు నాయకులు భాస్కర్ , రైతు సంఘం నాయకులు సుబ్బరాయుడు లు పొలాల కెళ్ళి పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులతో మాట్లాడి సమస్యను వ్యవసాయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేయడం వల్ల పాణ్యం మండలంలో సుమారు 1500 ఎకరాల్లో 250 మంది రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఏమాత్రం పంట చేతి కి రాకుండా తీవ్రంగా నష్టపోయారని,రాష్ట్ర ప్రభుత్వం ,వ్యవసాయశాఖ అధికారులు పంటలను పరిశీలించి పాణ్యం మండలంలోని పత్తి పంట వేసిన గ్రామాల్లో వ్యవసాయ శాఖా శాస్త్రవేత్తలతో పరిశీలన జరిపి నష్టానికి గల కారణాలను పరిశీలించాలని కోరారు,


నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎకరాకు 70,000 రూ/- లు నష్టపరిహారం ఇవ్వాలని ,పంటల భీమా వర్తింప చేయాలని,విత్తనాలు అమ్మిన కంపెనీ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సునిత్ కుమార్ రెడ్డి,రాజు, వెంకటేశ్వర్లు, మరియు స్థానిక  రైతులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: