అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా ఫించన్
బహదూర్ పూర తసీల్దార్ జుబేదా బేగం
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా ఫించన్ మంజూరు చేసినట్లు బహదూర్ పూర తసీల్దార్ జుబేదా బేగం వెల్లడించారు. ఇప్పటి వరకు పదివేలకు పై చిలుకు ఫించన్లను మంజూరుచేశామని ఆమె వెల్లడించారు.
అర్హుత ఉన్న ప్రతి ఒక్కరికి ఆసరా ఫించన్ అందిందన్నారు. ఈ ఫించన్ల మంజూరులో పూర్తి పారదర్శకత పాటించామని ఆమె వెల్లడించారు. అర్హతవున్న ప్రతి ఒక్కరికి ఆసరా ఫించన్ అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆమె వెల్లడించారు. అందుకు అనుగుణంగానే ఆసరా ఫించన్ల మంజూరు చేపట్టామని ఆమె తెలియజేశారు. ఆన్ లైన్ ప్రక్రియలో చేపట్టిన ప్రతి అప్లికేషన్ ను పూర్తి పారదర్శకంగా పరిశీలించామని ఆమె వెల్లడించారు.
Post A Comment:
0 comments: