ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పోతుల నాగరాజుకు ఓటు వేసి గెలిపించండి
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య ప్రచారం
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేల మండల పరిధిలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పోతుల నాగరాజుకు ఓటు వేయాలని కోరుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య ప్రచారం నిర్వహించింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడివేముల మండల కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను, శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను, గ్రామ సచివాలయ ఉద్యోగులను, పట్టభద్రు లైన నిరుద్యోగులను, విద్యావంతులను
,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కలిసి పోతుల నాగరాజుకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మద్దతు కోరుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ ,సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కన్వీనర్ రమేష్, బీసీ నాయకులు ప్రసాదు, వరుణ్ సుబ్బయ్య, చంద్రశేఖర్ తదితరులు ప్రచారం నిర్వహించారు.
Home
Unlabelled
ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పోతుల నాగరాజుకు ఓటు వేసి గెలిపించండి... బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య ప్రచారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: